శనివారం ఇసుక క్వారీ పనులకు సెలవు!

జయశంకర్ భూపాలపల్లి (భారతవాసి న్యూస్):పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని, రేపు (శనివారం) మహాదేవపూర్ ఇసుక క్వారీ పనులకు విరామం ప్రకటించారు. స్థానిక మైనారిటీ సోదరుల విన్నపం మేరకు గ్రామ సర్పంచ్ హసీనా బాను గారు చొరవ తీసుకుని, జయశంకర్ భూపాలపల్లి ప్రాజెక్ట్ అధికారితో మాట్లాడి ఈ సెలవును ఖరారు చేయించారు.
క్వారీలో లెవలింగ్, తర్పాలింగ్ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్న స్థానిక మైనారిటీ ప్రజల భావాలను గౌరవిస్తూ సర్పంచ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన అధికారులకు సర్పంచ్ హసీనా బాను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

