
సన్‌రైజర్స్‌కు భారీ షాక్
హైదరాబాద్, 20 మార్చి 2026 (భారతవాసి న్యూస్):
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాకు చెందిన యువ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయం కారణంగా మొత్తం సీజన్‌కు దూరమయ్యాడు. మార్చి 28న టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పరిణామం జట్టులో ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో జాక్ ఎడ్వర్డ్స్‌ను సన్‌రైజర్స్ యాజమాన్యం రూ. 3 కోట్లకు దక్కించుకుంది. అతనికి ఇది తొలి ఐపీఎల్ ఒప్పందం కావడం విశేషం. అయితే గాయం తీవ్రత కారణంగా కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ సీజన్ మొత్తానికి దూరమైనట్లు సమాచారం. గాయం స్వరూపంపై మాత్రం ఫ్రాంచైజీ ఇంకా అధికారికంగా వివరాలు వెల్లడించలేదు.
గతంలో ఇండియా-ఏ జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా-ఏ తరపున అద్భుతమైన ప్రదర్శనతో ఎడ్వర్డ్స్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఏడాది జనవరి 29న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరపున టి20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం కూడా చేశాడు.
ఇప్పటికే జట్టు సమతుల్యతపై ఈ గాయం ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అతని స్థానంలో ఎవరిని ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంపిక చేస్తారో ఆసక్తికరంగా మారింది. మరోవైపు జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయంతో పూర్తిగా కోలుకోకపోవడంతో ప్రారంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాడు. ఈ పరిస్థితిలో భారత వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అతనికి ఉప కెప్టెన్‌గా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వ్యవహరించనున్నాడు.
ఐపీఎల్ ప్రారంభానికి ముందు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటం జట్టుకు సవాల్‌గా మారగా, కొత్త కాంబినేషన్‌తో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
