🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 31 Aug, 2026 | Page: 1

బస్సు ఆపకపోవడంతో ప్రయాణికుడికి గాయాలు

వేములవాడ రూరల్, భారతవాసి: గుర్రవానిపల్లి స్టేజి వద్ద బస్సు పూర్తిగా ఆపకపోవడంతో దిగేందుకు ప్రయత్నించిన కొల్లూరి రామచంద్రన్ అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు గాయాలతో పాటు చేయి విరిగింది. తోటి ప్రయాణికులు, స్థానికులు అంబులెన్స్‌లో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులు స్టేజి వద్ద పూర్తిగా ఆపడం లేదని స్థానికులు ఆరోపిస్తూ, ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
🏠 Home