🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 03 Sep, 2026 | Page: 1

ఆర్జి త్రీ ఏరియా లోనీ ఏఎల్పి గనిలో ప్రమాదం.

ఆర్జి త్రీ ఏరియా లోనీ ఏఎల్పి గనిలో ప్రమాదం.

పెద్దపల్లి జిల్లా రామగుండం అర్జీ త్రీ ఏరియా లో అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ లో గురువారం ఉదయం తెల్లవారుజామున ఎయిర్ ట్యాంకర్ పేలిన ఘటనలో ఐదుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి. నైట్ షిఫ్ట్ విధులు ముగించుకొని బయటకు వస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎయిర్ ట్యాంకర్ పేలడంతో సమీపంలో ఉన్న ఇద్దరు కార్మికులకు తీవ్రమైన గాయాలు కాగా పక్కనే ఉన్న మరో ముగ్గురు కార్మికులకు స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం. అప్రమత్తమైన సహచర కార్మికులు వెంటనే క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చి ప్రాథమిక చికిత్స కోసం సెంటినరీ కాలనీలో డిస్పెన్సరీ తరలించారు. అనంతరం కార్మికులను మెరుగైన వైద్యం కోసం గోదావరిఖని ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఎయిర్ ట్యాంకర్ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
🏠 Home