🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 04 Sep, 2026 | Page: 1

పర్మిషన్ ఇచ్చారు.. ఫైన్లు కొడుతున్నారు!

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో నిర్వహించనున్న బిఆర్‌ఎస్‌ నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే కార్యక్రమానికి హాజరయ్యేందుకు తమ వాహనాలపై వచ్చిన కార్యకర్తలు కాటారం ప్రధాన కూడలి వద్ద నాయకుడి కోసం ఎదురుచూస్తున్న సమయంలో పోలీసులు ఎస్కార్ట్ వాహనాలతో వచ్చి ద్విచక్ర వాహనాలకు జరిమానాలు విధించడంపై చర్చనీయాంశంగా మారింది.

నిరసన కార్యక్రమానికి అనుమతి ఇచ్చినప్పటికీ.. కార్యక్రమానికి వస్తున్న కార్యకర్తల వాహనాలపై జరిమానాలు విధించడం ఏమిటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు అనుమతి ఇచ్చి మరోవైపు ఫైన్లు విధించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ప్రయత్నంలా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
🏠 Home