🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 05 Sep, 2026 | Page: 1

నూతన ఎంఈఓ భిక్షపతికి టీఎస్ యూటీఎఫ్ నాయకుల శుభాకాంక్షలు.

నర్సంపేట మండల నూతన మండల విద్యాధికారి (MEO) గా బాధ్యతలు స్వీకరించిన జె. భిక్షపతి గారిని టీఎస్ యూటీఎఫ్ (TSUTF) నర్సంపేట మండల కార్యవర్గ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి పెరబోయిన కుమార్ స్వామి మాట్లాడుతూ... మండల పరిధిలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేయాలని కోరారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి, ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి ఉపాధ్యాయ సంఘాల తరఫున ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఆయన నూతన ఎంఈఓకు విన్నవించారు.ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కందగట్ల రమేష్, మండల కోశాధికారి అర్జున్ సాగర్, సంఘ సీనియర్ నాయకులు చంద్రశేఖర్, సకినాల రమేష్, పులి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home