కల్వచర్లలో ఉచిత దంత వైద్య శిబిరం ప్రారంభం
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో రామ్ డెంటల్ హాస్పిటల్ పెద్దపల్లి వారి ఆధ్వర్యంలో, డా బాకం రామ్మూర్తి,డా బాకం కావ్య పర్యవేక్షణలో కల్వచర్ల ప్రభుత్వ పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరం ప్రారంభమైంది. ఈ శిబిరంలో విద్యార్థులు, గ్రామ ప్రజలకు ఉచితంగా దంత వైద్య పరీక్షలు నిర్వహించి, దంత సమస్యలకు అవసరమైన సూచనలు, సలహాలు అందించనున్నారు.
ఈ సందర్భంగా కల్వచర్ల సర్పంచ్ రేండ్ల శారదకుమారస్వామి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఉచిత దంత వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని దంత ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. దంత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి, వారి సూచనలు పాటించాలని కోరారు.
గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని సర్పంచ్ పేర్కొన్నారు.