బ్యాంకులకు వరుసగా నాలుగు రోజుల సెలవు
హైదరాబాద్: బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. సెప్టెంబర్ 11న బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయక చవితి సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. దీంతో రేపటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకు శాఖల్లో సాధారణ సేవలు నిలిచిపోనున్నాయి. ఖాతాదారులు నగదు లావాదేవీలు, చెక్కులు తదితర ముఖ్యమైన పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.