వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం: టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్
నర్సంపేట, సెప్టెంబర్ 10: సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పిసిసి సభ్యులు పెండెం రామానంద్ కొనియాడారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో గురువారం చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆమె విగ్రహానికి పెండెం రామానంద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ... నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ విముక్తి ఉద్యమంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. వెట్టిచాకిరి విముక్తి కోసం, భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన ధీశాలి ఆమె అని కొనియాడారు. కేవలం వర్ధంతి వేడుకలు నిర్వహించడమే కాకుండా, ఐలమ్మ ఆశయాల సాధన కోసం నేటి యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పంబి వంశీకృష్ణ, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, కౌన్సిలర్ పున్నం నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బైరి మురళీ, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, కొల్లూరి శ్రీహరి, మోటం రవికుమార్, పెద్దపెల్లి శ్రీనివాస్, ఓర్సు సాంబయ్య, గుడికందుల సదానందం, కొల్లూరి భాస్కర్, మేరుగు కిరణ్ యాదవ్, నాగేల్లి సారంగం గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, కొల్లూరి రాజు, నేదునూరి రాజు, రాయరాకుల శ్రీనివాస్, శంకరభక్తుల శివ, రామగొని సుధాకర్, గోక వేదప్రకాష్, భూక్య గణేష్, ఉప్పుల షాలోమ్, చీకటి శివమణి తదితరులు పాల్గొన్నారు.