🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 11 Sep, 2026 | Page: 1

గ్యాస్ కోసం తంటాలు.. ఐదు రోజులుగా పడిగాపులు

మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో గ్యాస్ లబ్ధిదారుల కష్టాలు కొనసాగుతున్నాయి. గతంలో మండల కేంద్రంలోనే గ్యాస్ ఏజెన్సీ ఉండగా ఇంటి వద్దకే సిలిండర్లు సరఫరా అయ్యేవని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఏజెన్సీ జిల్లా కేంద్రానికి తరలిపోవడంతో రూ.1,100 చెల్లించి గ్యాస్ బండి వద్దకే వెళ్లి సిలిండర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

గత ఐదు రోజులుగా గ్యాస్ కోసం ఎదురుచూస్తున్నామని, పండగల సమయంలోనూ ఈ ఇబ్బందులు తప్పడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ తరలింపునకు కారణం ఎవరు? తెరవెనుక ఎవరైనా హస్తం ఉందా? మండల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే బాధ్యత వహించాల్సిన నాయకులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

గ్యాస్ సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించి, లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
🏠 Home