🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 11 Sep, 2026 | Page: 1

ఆలయ పనుల వద్ద కాంట్రాక్టర్ అత్యుత్సాహం

కాళేశ్వరం: ఆలయ అభివృద్ధి పనుల కవరేజ్ కోసం శుక్రవారం వెళ్లిన విలేకరులను కాంట్రాక్టర్ అడ్డుకుని, ఆలయ ఈఓ అనుమతి తీసుకురావాలంటూ దురుసుగా వ్యవహరించినట్లు వారు ఆరోపించారు. ఈఓను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చిందన్నారు.

ఆలయ అభివృద్ధి పనుల కవరేజ్‌కు మీడియా ప్రతినిధులు వెళ్లకూడదని ఏమైనా నిబంధనలు ఉంటే, వాటిని స్పష్టంగా తెలియజేస్తూ పనుల ప్రదేశంలో నిబంధనల బోర్డు ఏర్పాటు చేయాలని పలువురు పేర్కొంటున్నారు. అలా ఉంటే మీడియా ప్రతినిధులు కూడా నిబంధనలను పాటించే అవకాశం ఉంటుందని అంటున్నారు.కవరేజ్‌కు వచ్చిన విలేకరులను అడ్డుకోవడం కాంట్రాక్టర్ అత్యుత్సాహమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై ఆలయ అధికారులు స్పష్టత ఇవ్వాలని విలేకరులు కోరుతున్నారు.
🏠 Home