🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 12 Sep, 2026 | Page: 1

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చైర్‌పర్సన్‌ దంపతులకు ఘన సన్మానం

నర్సంపేట, సెప్టెంబర్‌ 12: నర్సంపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, టీపీసీసీ సభ్యుడు పెండెం శ్రీలక్ష్మీరామానంద్‌ దంపతులను అఖిల భారత, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం బాధ్యులు ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లోని పద్మశాలి భవన్‌లో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు కుమార్త బొమ్మరెల్లి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పద్మశాలి ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన సమ్మేళనంలో సత్కరించారు.
ఈ సందర్భంగా శ్రీలక్ష్మీరామానంద్‌ మాట్లాడుతూ పద్మశాలి కుటుంబంలో జన్మించడం మార్కండేయ స్వామి ఆశీస్సులుగా భావిస్తున్నానన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీర్వాదంతో కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందన్నారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన సమ్మేళనానికి తనను ఆహ్వానించి సత్కరించడం సంతోషంగా ఉందన్నారు.
పద్మశాలీల ఆత్మగౌరవాన్ని పెంపొందించడంతో పాటు సంఘం అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. పద్మశాలి సమాజానికి అవసరమైన సమయంలో ముందుండి పనిచేస్తానని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, పరకాల మాజీ ఎమ్మెల్యే వర్నాల శ్రీరాములు, పద్మశాలి కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరు శ్రీనివాస్‌, హ్యాండ్లూమ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దూడం వెంకటరమణ, తెలుగు అకాడమీ చైర్మన్‌ కూరపాటి వెంకటనారాయణ, బీసీ కమిషన్‌ సభ్యుడు రాపోలు జయప్రకాష్‌, హ్యాండ్లూమ్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ బక్కని అనిత, అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గుండు ప్రభాకర్‌, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు గంజేంగి నందయ్య, శ్రీశైలం బోర్డు సభ్యుడు చిలువేరు కాశీనాధం, రాష్ట్ర మహిళా పద్మశాలి సంఘం అధ్యక్షురాలు రూప రజిని, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home