🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 14 Sep, 2026 | Page: 1

ఎన్నికలు నిర్వహించాలి, అప్పటి వరకు అన్ని సంఘాలకు సమాన హోదా కల్పించాలి. -ఎస్&పిసి, అడ్రియాల గని టిబిజికెఎస్ నాయకుల వినతి.

ఎస్&పిసి, అడ్రియాల గని టిబిజికెఎస్ నాయకుల వినతి.

సింగరేణిలో ఎన్నికల కాల పరిమితి ముగిసిన రీత్యా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల నిర్వహణ పూర్తయ్యే వరకు అన్ని రిజిస్టర్డ్ సంఘాలకు సమాన హోదా కల్పించాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజి రెడ్డి గారి ఆదేశాల మేరకు సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇసంపల్లి రమేష్ గారు అడ్రియాల గని మేనేజర్ హస్తి పెంచలయ్య గారికి, ఎస్&పీసీ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వద్ద జమేదార్ పిల్లి కుమారస్వామికి వేరువేరు కార్యక్రమాలలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఇసంపల్లి రమేష్ మాట్లాడుతూ సింగరేణిలో రెండు సంవత్సరాల కాల పరిమితితో 27.12.2023 రోజున ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇప్పటికీ రెండు సంవత్సరాల తొమ్మిది నెలల పైచిలుకు కాలం గడిచినప్పటికీ ఎన్నికలు నిర్వహించలేదని. అప్పుడు గెలిచిన యూనియన్లు వారి వారి అంతర్గత విషయాల కారణంగా ఆలస్యంగా గెలుపు పత్రం తీసుకున్నప్పటికీ 08 9 2026 రోజు నాటికి వారి కాలపరిమితి ముగిసినది. కావున తక్షణమే రహస్య బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు నిర్వహించాలని కోరుచున్నాము. ఎన్నికల నిర్వహణ పూర్తయ్యే వరకు రిజిస్టర్ యూనియన్లు అన్నిటికీ సమాన హోదా కల్పించి, కార్మికుల సమస్యలపై చర్చించే విధంగా అవకాశం కల్పించాలని తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘంగా కోరుచున్నాము. ఇప్పటికే సంఘ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి గారు సింగరేణి సంస్థ చైర్మన్, డైరెక్టర్(పా) గార్లకి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, ఇటీవల APA జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వర రావు గారికి కూడా వినతి పత్రం అందజేసిన విషయం విధితమే .
ఇంకా ఈ కార్యక్రమంలో ALP మైన్,ఎస్&పిసి ఫిట్ సెక్రటరీలు వివి గౌడ్, దేవరకొండ తిరుపతి, కేంద్ర కమిటీ నాయకులు గట్టు శ్రీనివాస్, చిరంజీవి, బ్రాంచి సెక్రటరీ తేజ, శివ శంకర్, బొడ్డు సమ్మయ్య, గొట్టే శ్రీనివాస్, కె చంద్రశేఖర్, పేర్క రమేష్, ముజాఫర్ అలీ,కొమురయ్య, సందీప్, సతీష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు .
🏠 Home