కుట్ర రాజకీయాలు మానండి.. ప్రజల సమస్యలు పరిష్కరించండి
మహాదేవపూర్:
బీఆర్‌ఎస్‌పై దుష్ప్రచారం చేయడం, కుట్ర రాజకీయాలకు పాల్పడటం మానుకుని ప్రజల సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ నాయకులు దృష్టి సారించాలని బీఆర్‌ఎస్ మండల నాయకుడు మురుకుట్ల రాజు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌పై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
శ్రీధర్‌బాబు పుట్టకముందే మహాదేవపూర్‌లో జీసీసీ ఉందని, ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని రాజు పేర్కొన్నారు. మహాదేవపూర్‌లో కొనసాగుతున్న గ్యాస్ ఏజెన్సీని భూపాలపల్లికి తరలించే ప్రయత్నాలపై కాంగ్రెస్ నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గ్యాస్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకుంటారా అని నిలదీశారు.
ఆధారాలు లేకుండా మా నాయకుడిపై అసత్య ఆరోపణలు చేయడం ఎందుకని నిలదీశారు. పుట్ట మధుకు జీసీసీ నుంచి ప్రతినెలా కమిషన్ అందుతోందంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారంపై ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నది మీరే కదా.. మరి మా నాయకుడు పుట్ట మధుపై ఆరోపణలు నిజమైతే ఎందుకు విచారణ చేపట్టడం లేదని రాజు ప్రశ్నించారు
బీఆర్‌ఎస్ ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే తమ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించి ఏజెన్సీని లాక్కునే ప్రయత్నం చేస్తున్నది మీరే కాదా అంటూ కాంగ్రెస్ నాయకులను ఎద్దేవా చేశారు. గ్యాస్ ఏజెన్సీ మండల కేంద్రం నుంచి తరలిపోయే పరిస్థితికి కారణం ఎవరో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు.
వారం రోజులుగా గ్యాస్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ నాయకులు పట్టించుకోకపోవడం ఏమిటని రాజు ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేయడం కంటే ప్రజలకు అందుబాటులో ఉండేలా గ్యాస్ ఏజెన్సీని తిరిగి మండల కేంద్రానికి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించడంపై కాంగ్రెస్ నాయకులు దృష్టి సారించాలని కోరారు.