పెద్దంపల్లిలో టీఆర్పీలో భారీ చేరికలు
రేగొండ:
రేగొండ మండలం పెద్దంపల్లి గ్రామం నుంచి పలువురు యువకులు సోమవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. 8వ వార్డు సభ్యుడు అంబటి కార్తీక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల్లో అంబటి కార్తీక్‌తో పాటు ఎర్రబాటి హరీష్, వజ్జీరు కిరణ్, చలుకాని సైలని, బాబా, సిద్ధార్థ తదితరులు పార్టీలో చేరారు. వారికి టీఆర్పీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కులు, అభ్యున్నతి, రాజ్యాధికారం కోసం టీఆర్పీ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పార్టీ విధానాలను గడపగడపకు తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.అంబటి కార్తీక్ మాట్లాడుతూ టీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న, జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో బహుజనుల కోసం జరుగుతున్న పోరాటాలకు ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు గండు కరుణాకర్, జిల్లా కోశాధికారి జినుకల శ్రీను, భూపాలపల్లి మండల అధ్యక్షుడు మీసాల రాజు, సామల చంద్రశేఖర్, పిట్టల రాంబాబు, జినుకల శ్రీకాంత్, వేల్పుల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.