లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తులసి విత్తనాలతో కూడిన మట్టి గణపతుల పంపిణీ
పర్యావరణ పరిరక్షణకు లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం: రామగిరి ఎస్ఐ శ్రీనివాస్
లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీకాలనీ ఆధ్వర్యంలో క్లబ్ ప్రెసిడెంట్ డా. శరణ్య యాదవ్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా 300 తులసి విత్తనాలతో కూడిన మట్టి గణపతులను కల్వచర్ల, సెంటినరీ కాలనీ భక్తులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి రామగిరి మండల ఎస్ఐ టి. శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మట్టి గణపతులను పంపిణీ చేశారు.రామగిరి ఎస్ఐ టి. శ్రీనివాస్ మాట్లాడుతూ మట్టి గణపతుల వినియోగం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తులసి విత్తనాలతో కూడిన మట్టి గణపతులను పంపిణీ చేయడం అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై మరింత అవగాహన పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ పర్యావరణహితమైన మట్టి గణపతులను ఉపయోగించాలి అని అన్నారు.క్లబ్ ప్రెసిడెంట్ డా. శరణ్య యాదవ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీకాలనీ ఆధ్వర్యంలో ప్రజలకు సేవ చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వినాయక చవితి సందర్భంగా 300 తులసి విత్తనాలతో కూడిన మట్టి గణపతులను పంపిణీ చేశాం. నిమజ్జనం అనంతరం తులసి విత్తనాలను మొలకెత్తించి మొక్కలుగా పెంచుకోవచ్చు. భక్తితో పాటు పర్యావరణాన్ని కాపాడాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లయన్స్ క్లబ్ లక్ష్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ మొల్మురి శ్రీనివాస్, మేకల మారుతి యాదవ్, క్లబ్ చైర్మన్ గంట వెంకట రమణారెడ్డి, కల్వచర్ల వార్డు సభ్యులు గోనే రాము తదితరులు పాల్గొన్నారు.