🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 17 Sep, 2026 | Page: 1

వినాయక నిమజ్జనంపై డీజే నిర్వాహకులకు కౌన్సెలింగ్

మహాదేవపూర్: వినాయక నిమజ్జనం సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మహాదేవపూర్ సీఐ డీజే ఆపరేటర్లు, నిర్వాహకులకు గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా నిమజ్జనం సమయంలో డీజేలను నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో వినియోగించరాదని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం జరిగేలా సహకరించాలని కోరారు. పోలీసుల సూచనలు, ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.కౌన్సెలింగ్ అనంతరం డీజే ఆపరేటర్లు, నిర్వాహకులను మహాదేవపూర్ తహసీల్దార్ సమక్షంలో బైండోవర్ చేశారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని డీజే నిర్వాహకులు తెలిపారు.
🏠 Home