🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 18 Sep, 2026 | Page: 1

నర్సంపేటలో ఘనంగా పోషణ సంబరాలు

. నర్సంపేట: జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా నర్సంపేట ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పట్టణంలోని రైతు వేదికలో శుక్రవారం పోషణ సంబరాలను ఘనంగా నిర్వహించారు. సీడీపీవో మధురిమ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండెం శ్రీలక్ష్మీరామానంద్‌ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా చిరుధాన్యాలతో తయారు చేసిన వివిధ రకాల వంటకాలు, పౌష్టికాహార ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కూరగాయలతో రూపొందించిన వినాయకుడి ప్రతిమ, చిరుధాన్యాలతో తయారు చేసిన పూర్ణకుంభం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కూరగాయలు, ఆకుకూర asa నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గర్భిణిగా నమోదైన నాటి నుంచి ఐదేళ్లలోపు పిల్లల వరకు పౌష్టికాహారం అందించడంతోపాటు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. పూర్వకాలపు సంప్రదాయ ఆహారపు అలవాట్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు శ్రీమంతాలు, ఆరు నెలలు నిండిన శిశువులకు అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు. అంగన్‌వాడీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి పోషణ ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో ఏసీడీపీవో జ్యోతి, డాక్టర్‌ భావన, కౌన్సిలర్‌ రజిత, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు.
🏠 Home