🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 20 Sep, 2026 | Page: 1

పాముకాటుతో రైతు మృతి

మల్హర్‌: మండలంలోని తాడిచర్లకు చెందిన రైతు కందుల మల్లయ్య (52) శనివారం పాముకాటుకు గురై మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. వ్యవసాయ పనులు చేస్తుండగా మల్లయ్యను పాము కాటేసింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన భూపాలపల్లి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
🏠 Home