సమ్మక్క సారక్క జిల్లా సమైక్య అధ్యక్షురాలుగా సరిత ఎన్నిక
సమ్మక్క సారక్క జిల్లా సమైక్య అధ్యక్షురాలుగా ముదురుకోల సరితను మహిళా సంఘం సమైక్య సభ్యులు సోమవారం ఎన్నుకున్నారు..సమ్మక్క సారక్క జిల్లా సమైక్యకు సంబంధించిన అధ్యక్షురాలు, కార్యదర్శి ,కోశాధికారి పదవులకు ఇటీవల కాలపరిమితి ముగియడంతో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం ఎన్నికలు నిర్వహించారు..ఈ ఎన్నికల్లో అధ్యక్షురాలుగా ఘనపూర్ మండలం చెల్పూర్ కు చెందిన ముదురుకోళ్ల సరిత, కార్యదర్శిగా టేకుమట్ల కు చెందిన గువాడి రజిత, కోశాధికారిగా మల్హర్ మండలం కొయ్యూరు కు చెందిన మీసాల సౌజన్య ఎన్నికయ్యారు..