మైనర్ బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి యావజ్జీవ శిక్ష
భూపాలపల్లి: మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి, ఆమె ఆత్మహత్యకు కారకుడైన గోల్కొండ రాజశేఖర్‌కు భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె. జీవన్ కుమార్ మంగళవారం యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు. 2021 డిసెంబర్‌లో కాటారం మండలం ధన్వాడకు చెందిన బాలికను బెదిరించి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఘటన అనంతరం బాలిక పురుగుల మందు సేవించి చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల దర్యాప్తులో నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది. కేసు దర్యాప్తు, విచారణలో కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అభినందించారు.