🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 26 Sep, 2026 | Page: 1

కాంగ్రెస్ పార్టీలో చేరిన పెందుర్ జీవన్ మహారాజ్*

*కాంగ్రెస్ పార్టీలో చేరిన పెందుర్ జీవన్ మహారాజ్*

*గుడిహత్నూర్, భారత వాసి సెప్టెంబర్ 26:* గుడిహత్నూర్ మండల కేంద్రంలో సోమవారం సామాజిక కార్యకర్త పెందుర్ జీవన్ మహారాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ సోయం బాపురావు, బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు జీవన్ మహారాజ్ తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల ముఖ్య కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home