🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 28 Sep, 2026 | Page: 1

రాజ్యాంగ హక్కులపై బీసీల్లో అవగాహన పెరగాలి

—సామాజిక న్యాయ సాధనకు రాజ్యాంగమే ఆధారం
మహాదేవపూర్, భారతవాసి: బీసీ వర్గాల్లో రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలపై విస్తృత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని జాతీయ బీసీ సంఘం జిల్లా ఇన్‌చార్జి విజయగిరి సమ్మయ్య నాయీ అన్నారు. సోమవారం మహాదేవపూర్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు.రాజ్యాంగంలోని 15, 16 అధికరణాలు సమానత్వం, సమాన అవకాశాలకు సంబంధించిన కీలక నిబంధనలు కలిగి ఉన్నాయని తెలిపారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగం ప్రత్యేక ప్రాధాన్యం కల్పించిందన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం, అవకాశాలు కల్పించేలా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు.తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఆమోదించిందని, అది అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని రాజకీయ పార్టీల్లోని బీసీ నాయకులు, బీసీ సమాజం తమ హక్కులను తెలుసుకుని వాటి సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగం సామాజిక న్యాయం, సమానత్వానికి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు.
🏠 Home