🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 28 Sep, 2026 | Page: 1

ఐదు దశాబ్దాల ప్రస్థానం.. ఘనంగా అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవాలు

మహాదేవపూర్, భారతవాసి: ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఆదివారం హైదరాబాద్‌లోని సామ్రాట్ కాంప్లెక్స్‌లో ఘనంగా నిర్వహించారు. 1977–2026 వరకు సంఘం సాగించిన ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సంఘం నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు కడారి వినయ్‌కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గంలో నడిచినప్పుడే సమాజంలో స్వేచ్ఛ, సమానత్వం, సమాన విద్యావకాశాలు అందరికీ అందుతాయని అన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు యువత ముందుండాలని పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన అంబేద్కర్ యువజన సంఘాన్ని బలోపేతం చేస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత సంఘం నాయకులు, యువతపై ఉందన్నారు.అర్ధ శతాబ్ది ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన స్వర్ణోత్సవాలు సంఘం శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కోఆర్డినేటర్ వరుణ్‌కుమార్ మామిడిపల్లి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు బాపయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ లింగాల రామయ్య, మహాదేవపూర్ మండల అధ్యక్షుడు మేరుగు లక్ష్మణ్‌తో పాటు వివిధ జిల్లాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
🏠 Home