🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 29 Sep, 2026 | Page: 1

కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిసిన వేముల మహేందర్‌గౌడ్

హన్మకొండ: తెలంగాణ మాజీ మంత్రి, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖను బీసీ సంక్షేమ సంఘం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్‌గౌడ్‌ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హన్మకొండ రామనగర్‌లోని కొండా సురేఖ నివాసానికి వెళ్లిన ఆయన కొండా సురేఖతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిపారు. కొండా దంపతులపై తనకున్న అభిమానాన్ని వేముల మహేందర్‌గౌడ్‌ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. జిల్లాలో బీసీల సంక్షేమం, ప్రజా సమస్యలు తదితర అంశాలపై కూడా చర్చించినట్లు పేర్కొన్నారు.
🏠 Home