🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 29 Sep, 2026 | Page: 1

కాంగ్రెస్ నేతల్లారా.. నోరు అదుపులో పెట్టుకోండ్రి: కొండా సురేఖ

వరంగల్‌: కాంగ్రెస్‌ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మాజీ మంత్రి, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ఘాటుగా హెచ్చరించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్‌ గుండు సుధారాణి వ్యాఖ్యలకు ఆమె కౌంటర్‌ ఇచ్చారు. తనను, తన అనుచరులను తక్కువ చేసి మాట్లాడితే మహిళల నుంచే ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. తమ ముందు కుప్పిగంతులు వేస్తే తగిన విధంగా బుద్ధి చెబుతామని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేతలు మాటల విషయంలో హద్దులు పాటించాలని సూచించారు.
🏠 Home