విద్యార్థుల అల్పాహారంపై సీఎం ప్రత్యేక దృష్టి
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే అల్పాహారంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. జూబ్లీహిల్స్ నివాసంలో హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సమావేశమైన సీఎం.. విద్యార్థుల శారీరక ఎదుగుదల, విద్యా పురోగతిని ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, ఆహారంలోని క్యాలరీలను లెక్కించేందుకు యాప్‌లను వినియోగించాలని అన్నారు. ప్రాంతాల వారీగా ఆహారపు అలవాట్లకు అనుగుణంగా అల్పాహారం అందించాలని సూచించారు. నవంబర్ 30లోగా సెంట్రల్ కిచెన్ల నిర్మాణాలు పూర్తి చేసి, డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని ఆదేశించారు. నాగర్‌కర్నూల్ కిచెన్‌కు రూ.5.17 కోట్లు, వికారాబాద్ కిచెన్‌కు రూ.4 కోట్లను సంస్థల ప్రతినిధులు హరే కృష్ణ ఫౌండేషన్‌కు అందించారు.