🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 02 Oct, 2026 | Page: 1

గిగ్‌ వర్కర్ల సంక్షేమానికి అండగా ప్రభుత్వం కొండాపూర్‌లో ‘అప్జీ హౌస్‌’ ప్రారంభించిన మంత్రి వివేక్‌ వెంకటస్వామి


హైదరాబాద్‌, అక్టోబర్‌ 2:
గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్ల సంక్షేమం, భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. గిగ్‌ వర్కర్లకు చట్టపరమైన రక్షణతో పాటు సామాజిక భద్రత, సంక్షేమ సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
శుక్రవారం కొండాపూర్‌లో క్యాబ్‌ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌, గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్ల కోసం ఏర్పాటు చేసిన ‘అప్జీ హౌస్‌’ను మంత్రి వివేక్‌ వెంకటస్వామి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో శక్తి శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, మాజీ ఎంపీ రంజిత్‌ రెడ్డి, తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు సలావుద్దీన్, అప్జీ ప్రతినిధులు, గిగ్‌ వర్కర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
నగర జీవన విధానంలో గిగ్‌ వర్కర్లు కీలకంగా మారారని మంత్రి అన్నారు
🏠 Home