కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
కాలేశ్వరం, భారతవాసి: కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించి, విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. స్టేషన్‌లోని వివిధ రికార్డులను తనిఖీ చేశారు.
ఎస్సై, స్టేషన్ రైటర్, సీసీటీఎన్ఎస్ రైటర్లతో మాట్లాడి ఆన్లైన్లో వివరాల నమోదు, రికార్డుల అప్లోడ్ ప్రక్రియపై ఆరా తీశారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాలు, గ్రామాల పరిస్థితి, శాంతిభద్రతలు, స్టేషన్ నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితులకు సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, వారి ఇళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు.రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న పోలీస్‌స్టేషన్ కావడంతో సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజల భద్రతకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు.