విద్య, వైద్య సంస్థల్లో పీఓ ఆకస్మిక తనిఖీలు

ఏటూరునాగారం, భారతవాసి: ప్రభుత్వ విద్య, వైద్య సేవలు ప్రజలకు మెరుగ్గా అందేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులను ఆదేశించారు. ఏటూరునాగారం మండలంలోని పలు ప్రభుత్వ సంస్థలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆకులవారిఘనపూర్ అంగన్వాడీ కేంద్రం, జీపీ పాఠశాలతో పాటు ఏటూరునాగారం సబ్‌సెంటర్-1 పల్లె దవాఖాన సబ్‌సెంటర్-2లను సందర్శించారు.
అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల హాజరు, రికార్డులు, పోషకాహారం, అభ్యసన సామగ్రి, నిర్వహణ తీరును పరిశీలించారు. చిన్నారులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని, బోధనా సామగ్రిని సమర్థంగా వినియోగిస్తూ వారి అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించాలని సిబ్బందికి సూచించారు.పాఠశాలలో తరగతి గదులను పరిశీలించిన పీఓ విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన స్థాయిని తెలుసుకున్నారు. నోట్‌బుక్స్, బోధనా సామగ్రిని పరిశీలించి ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.పల్లె దవాఖానల్లో వైద్య సేవలు, మందుల లభ్యత, నిల్వలు, రికార్డులు, రోగుల వివరాల నమోదు, ఓపీ సేవలు, వైద్య పరికరాలను పరిశీలించారు. గ్రామీణ ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.విద్య, వైద్య సంస్థల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని పీఓ స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ విద్యార్థులు, చిన్నారులు, గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.