రక్తదానం.. ప్రాణదానంతో సమానం
కన్నాయిగూడెం, భారతవాసి: రక్తదానం ప్రాణదానంతో సమానమని రెడ్‌క్రాస్ జిల్లా ప్రతినిధి అబ్బు సతీష్ అన్నారు. ములుగు జిల్లా రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ముప్పనపల్లి సహాయ నిధి దాతల సహకారంతో గురువారం కన్నాయిగూడెం రైతువేదికలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 55 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి అందజేశారు.
అత్యవసర సమయాల్లో రక్తం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. యువతతోపాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల వారు స్వచ్ఛందంగా రక్తదానం చేసి శిబిరాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాడి రాంబాబు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సుగ్గుల సమ్మయ్య, వ్యవసాయ శాఖ అధికారి మహేష్, కన్నాయిగూడెం వైద్యాధికారి డాక్టర్ ప్రణీత్, పూజారి కిషోర్, బొల్లె భాస్కర్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి, బీసీ జేఏసీ అధ్యక్షుడు ఎం.బిక్షపతి, మఠం వెంకటేష్, చిదరి సుమన్, అగ్గు వెంకటేష్, తాడూరి శ్రీధర్, మరికాల వెంకటేష్, అబ్బు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ముప్పనపల్లి సహాయ నిధి సభ్యులు ఎన్.రాజేష్, డాక్టర్ రమేష్, టీ.విజయ్, టీ.రాజు, వీ.నాగరాజు, టీ.ప్రతాప్, వీ.రాజు తదితరులు శిబిరం నిర్వహణలో సహకరించారు. మీడియా ప్రతినిధులు ఎండీ.శాయక్, పి.నాగరాజు, గడ్డం రాజు, ఎస్.మల్లేష్, వీ.రమేష్, కె.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.