🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 11 Oct, 2026 | Page: 1

తాడిచెర్లలో 374 నిర్మాణాలు నేలమట్టం

తాడిచర్ల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచర్ల గ్రామపంచాయతీ పరిధిలోని షాత్రాజ్‌పల్లిలో అర్ధరాత్రి అధికారులు భారీ తొలగింపు చర్యలు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి పోలీసు, అటవీ, రెవెన్యూ, సింగరేణి, అగ్నిమాపక శాఖల అధికారులు సంయుక్తంగా జేసీబీలతో 374 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.
2026 జూలై 7న తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయగా, జూలై 12న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జూలై 14న కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించారు. సింగరేణి రెండో బొగ్గు గని నేపథ్యంలో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి, పరిహారం, పునరావాస ప్యాకేజీ ఆశతో నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 374 నిర్మాణాల తొలగింపు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
🏠 Home