చెన్నూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో అంబరాన్ని అంటిన బతుకమ్మ సంబరాలు ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు!
అక్టోబర్ .11:చెన్నూర్:తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పండుగైన బతుకమ్మ సంబరాలు చెన్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం లో అంబరాన్ని అంటాయి. ఈ వేడుకల్లో చెన్నూర్ మున్సిపాల్ చైర్మన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్ గారు మహిళా కౌన్సిలర్స్ ఆడపడుచులు అత్యంత ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
రంగురంగుల పూలతో రకరకాల రూపాల్లో బతుకమ్మలను తీర్చిదిద్ది, అనంతరం మహిళల కౌన్సిలర్స్ అందరూ మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఒకచోట చేరి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ, సాంప్రదాయ పాటలు పాడుతూ కోలాటాలతో ఎంతో ఘనంగా వేడుకలను జరుపుకున్నారు. ఈ ప్రాంగణమంతా మహిళల పాటలు పండుగ వాతావరణం సంతరించుకుంది.