🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 15 Oct, 2026 | Page: 1

సింగరేణి ఉద్యోగాలపై కేటీఆర్ కు మంత్రి వివేక్ వెంకటస్వామి కౌంటర్!


హైదరాబాద్: సింగరేణి సంస్థ, కొత్త బొగ్గు గనుల కేటాయింపుల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
సరైన సమాచారం లేకుండానే కేటీఆర్ మాట్లాడుతున్నారని, కేవలం హైప్ కోసమే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో ఒక్క గని కూడా రాలేదు:
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సింగరేణిలో ఉద్యోగుల సంఖ్య లక్ష నుండి 38 వేలకు పడిపోయిందని, దాదాపు 62 వేల ఉద్యోగాలు తగ్గిపోయాయని మంత్రి పేర్కొన్నారు. ఆ పదేళ్లలో ఒక్క కొత్త గని కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు.
🏠 Home