🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 16 Oct, 2026 | Page: 1

కాటారం–మహాదేవపూర్ రహదారిపై క్షుద్రపూజల కలకలం


కాటారం:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం–మహాదేవపూర్ ప్రధాన రహదారిపై క్షుద్రపూజలు కలకలం రేపాయి. కాటారం నుంచి మహాదేవపూర్ వెళ్లే మార్గంలో నస్తూరుపల్లి గ్రామానికి వెళ్లే దారివద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పండుగకు ముందు రహదారి సమీపంలో క్షుద్రపూజలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
పండుగ సమీపిస్తున్న వేళ ఈ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామస్తులు, అటుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి కావడంతో ఈ మార్గంలో నిత్యం అనేక మంది ప్రయాణిస్తుంటారు. అలాంటి ప్రాంతంలో పూజలకు సంబంధించిన వస్తువులు కనిపించడంతో ఏమి జరిగిందనే అంశంపై స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరు, ఏ కారణంతో పూజలు నిర్వహించారనే విషయం తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.
🏠 Home