🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 20 Oct, 2026 | Page: 1

మెట్ పల్లిలో ఘనంగా విజయదశమి వేడుకలు

మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మెట్ పల్లిలో విజయదశమి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులంతా కలిసి ఊరి చివర ఉన్న జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి ఆకులను తెంపి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పెద్దలకు జమ్మి ఆకులను అందించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచి వెన్నపురెడ్డి సంజీవరెడ్డి, ఉపసర్పంచి శ్రీరాముల మనోజరాజయ్య, వార్డు సభ్యులు ముల్కల లక్ష్మీ, , బూర్తి మల్లయ్య, కావేరి సమ్మయ్య, గుంటి అరుణ, దుర్గంరవీందర్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ముల్కల కత్తెరసాల, భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచి ముల్కల శోభా రవీందర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచి బూర్తి పోచం, సీనియర్ నాయకులు తోడే మల్లారెడ్డి పోటు జగన్ రెడ్డి తోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
🏠 Home