ప్రవేట్ పాఠశాలలో నిలువు దోపిడి పై కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన జనసేన పార్టీ వీర నాయకురాలు రాగుల శిరీష
స్కాలర్షిప్ టెస్టుల పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కు వినతి
**జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన జనసేన వీర మహిళా నాయకురాలు రాగుల శిరీష
కరీంనగర్: విద్యా సంవత్సరం ముగియకముందే స్కాలర్షిప్ టెస్టుల పేరుతో ముందస్తు అడ్మిషన్లకు పాల్పడుతూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేస్తున్న ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ వీర మహిళా నాయకురాలు రాగుల శిరీష డిమాండ్ చేశారు. ఈ మేరకు జనసేన వీర మహిళా నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాగుల శిరీష మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి నుంచే స్కాలర్షిప్ టెస్టుల పేరుతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆకర్షిస్తూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల తీరుపై సంబంధిత విద్యాశాఖ అధికారులు, ఇంటర్మీడియట్ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
ఈ వ్యవహారంపై గతంలో పలుమార్లు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఆశించిన స్పందన లేదని ఆమె పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లకు పాల్పడకుండా అడ్డుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్కాలర్షిప్ టెస్టుల పేరుతో జరుగుతున్న ముందస్తు అడ్మిషన్ల వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆమె కోరారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన విద్యాసంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ముందస్తుగా అడ్మిషన్లు చేపట్టేందుకు టెస్టులు నిర్వహించకుండా సంబంధిత విద్యాసంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని, ఆదేశాలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు గుండ శకుంతల, కందకట్ల స్వరూప, రజిత, సుజాతతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.