వరి పంటలో కట్వార్మ (రెల్ల రాలు పురుగు) నివారణ సూచనలు. కొడిమ్యాల, అక్టోబర్ 27: (భారత వాసి ప్రతినిధి).
కొడిమ్యాల మండలంలో మండల వ్యవసాయాదికారిణి పి జ్యోతి వరి పంట కోత దశలో కాడ తొలుచు పురుగులను పంట పొలాల్లో పరిశీలించారు. వరి పంట కోత దశలో ఆశించే కట్వార్మ (రెల్ల రాలు పురుగు) పురుగును సాధారణంగా ఆర్మీవార్మ్ / కట్ వార్మ్ అని పిలుస్తారు. ఇవి రాత్రి వేళల్లో పైకి పాకి, గింజలతో నిండిన వరి కంకులను మొదలు వద్ద కత్తిరిస్తాయి. దీనివల్ల కంకులు నేలరాలి కోతకు వచ్చే సమయంలో తీవ్ర దిగుబడి నష్టం జరుగుతుందని తెలిపారు.
పురుగుల మందులను నేరుగా గింజలు లేదా కంకుల పై పిచికారీ చేయకూడదన్నారు. కట్వార్మ (రెల్ల రాలు పురుగు) పురుగులు పగటిపూట సూర్యరశ్మికి భయపడి వరి పిలకల మొదళ్లలో, మట్టి పగుళ్లలో లేదా ఎండిన ఆకుల కింద దాక్కుంటాయి. కాబట్టి పిచికారీ చేసేటప్పుడు మందును మొక్క మొదళ్ల కింది భాగం పై మాత్రమే పడేలా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలన్నారు. కట్వార్మ (రెల్ల రాలు పురుగు) నివారణకు లీటరు నీటికి 1.5 2 నోవాల్యూరాన్ తో కలిపి ఎమామెక్టిన్ బెంజోయేట్, లీటరు నీటికి 0.3 2 క్లోరాంట్రానిలిప్రోల్, లీటరు నీటికి 0.4 2 ఎమామెక్టిన్ బెంజోయేట్ పిచికారీ చేసే ముందు మందు లేబుల్‌పై సూచించిన మోతాదు, పంటకు అనుమతి, భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించాలని మండల వ్యవసాయధికారిని పర్లపెల్లి జ్యోతి తెలిపారు.