అక్రమ హౌస్ అరెస్టులతో బీజేపీ పోరాటాలను ఆపలేరు: డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

వరంగల్: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు చేపట్టిన “చలో హైదరాబాద్” కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వరంగల్, నర్సంపేట నియోజకవర్గాల్లోని బీజేపీ నాయకులను గృహనిర్బంధం చేయడం కాంగ్రెస్ అహంకారానికి పరాకాష్ట అని మండిపడ్డారు.1975 నాటి ఎమర్జెన్సీ పైనే తిరగబడిన చరిత్ర తమదని, పోలీసుల అక్రమ నిర్బంధాలతో ప్రజా సమస్యలపై బీజేపీ చేస్తున్న పోరాటాలను, తమ గొంతును నొక్కలేరని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును రేవంత్ రెడ్డి ప్రభుత్వం...