ఆరు గ్యారంటీలు.. 420 హామీల అమలేది?

మహాదేవపూర్, భారతవాసి: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ మండల శాఖ నాయకులు సోమవారం ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాకంఠక పాలన సాగిస్తోందని వారు ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎంపీడీఓ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు అభయహస్తం మేనిఫెస్టోతో పాటు ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను ప్రకటించిందని నాయకులు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 33 నెలలు దాటినా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి పూర్తిగా...