వినాయక నిమజ్జనానికి చెరువుల పరిశీలన

నర్సంపేట, సెప్టెంబర్ 7: వినాయక నవరాత్రి ఉత్సవాలు నేపథ్యంలో గణనాథుల నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నర్సంపేట మున్సిపల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం నర్సంపేట మున్సిపల్ పరిధిలోని దామర చెరువు, మాదన్నపేట చెరువులను మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, టౌన్ సీఐ ముస్క శ్రీనివాస్‌లతో కలిసి చెరువులను పరిశీలించిన చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి .రామనంద్. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో దామర చెరువులో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. దీంతో గణనాథుల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు తెలిపారు. నవరాత్రుల్లో భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న...