ఓటర్ల జాబితా సవరణకు గడువు పొడిగింపు

హైదరాబాద్ : తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో క్లెయిమ్స్‌, అభ్యంతరాల దాఖలు గడువును ఎన్నికల సంఘం పొడిగించింది. సెప్టెంబర్‌ 16తో ముగియాల్సిన గడువును అక్టోబర్‌ 7 వరకు పొడిగించింది. దాఖలైన క్లెయిమ్స్‌, అభ్యంతరాలను నవంబర్‌ 5లోగా పరిష్కరించనున్నారు. అనంతరం నవంబర్‌ 9న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు