కుదురుపల్లి వాగు వద్ద రోడ్డు ప్రమాదం

కుదురుపల్లి వాగు వద్ద రోడ్డు ప్రమాదం మహాదేవపూర్: కుదురుపల్లి వాగు వద్ద మంగళవారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో కాళేశ్వరం గ్రామానికి చెందిన బండి అనిల్‌కు కాలు విరిగింది. కొత్త బెగ్లూర్‌కు చెందిన పెద్దపోలు సత్యం గౌడ్‌కు కాలు, స్వరూపకు చేయి విరిగినట్లు తెలిపారు. స్థానికులు 108కు సమాచారం అందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.