వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం: టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్
నర్సంపేట, సెప్టెంబర్ 10: సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పిసిసి సభ్యులు పెండెం రామానంద్ కొనియాడారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో గురువారం చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆమె విగ్రహానికి పెండెం రామానంద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ... నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ విముక్తి ఉద్యమంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. వెట్టిచాకిరి విముక్తి కోసం, భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన ధీశాలి ఆమె అని కొనియాడారు. కేవలం వర్ధంతి వేడుకలు నిర్వహించడమే కాకుండా, ఐలమ్మ ఆశయాల...