మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు రజక సంఘం వినతి.

నర్సంపేట, సెప్టెంబర్ 10:వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని నర్సంపేట పట్టణంలో తెలంగాణ రజక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం పట్టణ అధ్యక్షుడు కొల్లూరు లక్ష్మీనారాయణ, డివిజన్ గౌరవ అధ్యక్షుడు రాయరాకుల సారంగం, పట్టణ గౌరవ అధ్యక్షుడు ఐలోని శ్రీనివాస్, కార్యదర్శి తడిగొప్పుల రవి మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన నిప్పుకనిక చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ఆమె అడుగుజాడల్లో నడుస్తూ, ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.గత ప్రభుత్వం ఐలమ్మ జయంతి,...