విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు మృతి

వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. రైతు తాటి శంకరయ్య పంటచేనులో మోటార్‌కు విద్యుత్‌ వైర్లు లాగుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి కంది సమ్మయ్య, తుమ్మ అభిషేక్‌ మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స కోసం ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి విద్యుత్‌ వైర్‌కు ఎర్త్‌ తగలడమే కారణంగా గుర్తించినట్లు సమాచారం. ఘటనతో పేరూరులో విషాదం నెలకొంది.