గ్యాస్ ఏజెన్సీ తరలింపు పై భగ్గుమన్న బీఆర్ఎస్

మహాదేవపూర్: మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీని జిల్లా కేంద్రానికి తరలించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ శనివారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజన, గ్రామీణ ప్రజలు గ్యాస్ కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నాయకులు పేర్కొన్నారు. మంథని నియోజకవర్గ ప్రజల సమస్యలు మంత్రికి పట్టవా? అని ప్రశ్నించారు. ఏజెన్సీ తరలింపుపై అధికార కాంగ్రెస్‌ నాయకుల మౌనం వెనుక ఆంతర్యమేంటో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ఏజెన్సీ తరలింపునకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబే బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. మండలంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రధాన కార్యాలయాలు,...