పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చైర్‌పర్సన్ దంపతులకు ఘన సన్మానం
నర్సంపేట, సెప్టెంబర్ 12: నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్, టీపీసీసీ సభ్యుడు పెండెం శ్రీలక్ష్మీరామానంద్ దంపతులను అఖిల భారత, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం బాధ్యులు ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లోని పద్మశాలి భవన్‌లో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు కుమార్త బొమ్మరెల్లి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పద్మశాలి ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన సమ్మేళనంలో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ పద్మశాలి కుటుంబంలో జన్మించడం మార్కండేయ స్వామి ఆశీస్సులుగా భావిస్తున్నానన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీర్వాదంతో కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందన్నారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన సమ్మేళనానికి తనను ఆహ్వానించి...