సొంతూరి రుణం.. ఆలయ నిర్మాణంతో తీర్చిన భక్తుడు

మహాదేవపూర్: పుట్టిన గడ్డపై మమకారం.. దైవంపై అచంచల విశ్వాసం కలగలిసి ఓ భక్తుడి సంకల్పానికి రూపమిచ్చాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలం బొమ్మాపూర్‌ గ్రామానికి చెందిన ఓడేటి భాస్కర్‌రెడ్డి (మల్లారెడ్డి కుమారుడు) తన స్వగ్రామంలోని లింగాల గుట్టపై ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఆ సంకల్పాన్ని నెరవేర్చి ఆదివారం ఆలయ ప్రారంభోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర వేడుకకు బొమ్మాపూర్‌ గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు మొక్కులు చెల్లించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఉన్నత చదువులు అభ్యసించి ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ తన పుట్టిన ఊరును, దైవభక్తిని మరువకుండా ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన...