గ్యాస్ ఏజెన్సీ తరలింపును రాజకీయ కోణంలో చూడొద్దు

మహాదేవపూర్: మహాదేవపూర్ మండలంలో కొనసాగుతున్న హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీని భూపాలపల్లి జిల్లా కేంద్రానికి తరలించే అంశంపై బీఆర్‌ఎస్‌ నాయకులు చేపట్టిన రాస్తారోకోపై కాంగ్రెస్‌ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గ్యాస్ ఏజెన్సీ తరలింపు విషయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును నిందించడం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న విమర్శలేనని పేర్కొన్నారు. హిందుస్థాన్‌ పెట్రోలియం సంస్థ ద్వారా గిరిజన సహకార సంస్థకు గ్యాస్‌ డీలర్‌షిప్‌ మంజూరైందని, డీలర్‌షిప్‌ పరిధి మార్పు విషయంలో సంబంధిత సంస్థల నిర్ణయమే కీలకమని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. హెచ్‌పీ సంస్థ, జీసీసీ మధ్య పరిపాలనా లేదా ఇతర కారణాలతో ఏమైనా నిర్ణయం జరిగిందా అనే విషయం తమకు తెలియదని, ముందుగా దీనిపై సంబంధిత సంస్థల...